విశాఖ జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పుంజుకుంటోంది. జిల్లాలోని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్టోబర్లో 5,786 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా... 67.88 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నవంబర్లో 5,677 దస్త్రావేజులు రిజిస్ట్రేషన్ జరిగి... 68.43 కోట్లు రూపాయలు వచ్చాయి.
2020- 21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కలిపి నవంబర్ నెల వరకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 512.85 కోట్లు కాగా 71.26 శాతంతో ఇప్పటి వరకు 365.49 కోట్లు సాధించారు. గతేడాది ఇదే కాలానికి 382.63 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం పెద్ద ప్రకృతి విపత్తులు లేవు. ఈ ఏడాది నాలుగు నెలలు కార్యాలయాలు మూతపడినా దాదాపు అదే ఆదాయం రావడం విశేషం. విశాఖపట్నం వరకు చూసుకుంటే రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం కరోనా ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రోజూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి.