ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బియ్యం మాత్రమే ఉన్నాయి అవే పట్టుకెళ్లు..' - vishaka district

విశాఖ జిల్లా చోడవరంలో నాలుగో విడత రేషన్ పంపిణీ అస్థవ్యస్థంగా మారింది. మే నెల కోటా బియ్యం, శెనగపప్పు ఉచితంగా అందజేయాలి. కానీ, బియ్యం మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో కార్డుదారుడు ఊసురుమంటూ వెనుతిరుగుతున్నాడు.

Ration difficulties in chodavaram
కోటా..ఇబ్బందులు

By

Published : May 16, 2020, 4:25 PM IST

'బియ్యం మాత్రమే ఉన్నాయి అవే పట్టుకెళ్లు, శెనగల కోసం మళ్లీ రా ...' ఇది నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో చౌకడిపోల వద్ద వినిపించే మాటలు. విశాఖ జిల్లా చోడవరం మండలంలో 53 చౌకడిపోలు ఉన్నాయి. 28,234 కార్డుదారులు ఉన్నారు. మే నెల కోటా బియ్యం, శెనగపప్పు ఉచితంగా అందజేస్తున్నారు. ఇక్కడ చాల డిపోలలో బియ్యం మాత్రమే అందిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే శెనగలకు మళ్లీ రావాలంటూ డీలర్లు చెబుతున్నారని కార్డుదారులు వాపోతున్నారు. సరకుల నిమిత్తం రెండు దఫాలు వేలిముద్రలు వేయాలా అంటూ విస్తుపోతున్నారు. డిపోల వద్ద ఏలాంటి సదుపాయాలు లేవు. షరా మాములుగానే సరుకుల పంపిణీ చేస్తున్నారు. శానిటైజర్ లేదు. బకెట్​తో నీళ్లు, సబ్బు వంటివి ఏర్పాటు చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details