ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఖరీఫ్ సాగుకు.. రైవాడ సాగునీరు విడుదల

By

Published : Aug 4, 2020, 7:49 PM IST

విశాఖ జిల్లా రైవాడ జలాశయం నుంచి ఖరీఫ్ పంటలకు అధికారులు సాగునీటిని విడుదల చేశారు. ఆయకట్టులో వరినాట్లుకు 150 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు తెలిపారు. నీటి విడుదలతో రైతులు వ్యవసాయ పనులు శ్రీకారం చుట్టారు.

ఖరీఫ్ సాగుకు.. రైవాడ సాగునీరు విడుదల
ఖరీఫ్ సాగుకు.. రైవాడ సాగునీరు విడుదల



విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి మంగళవారం ఆయకట్టులో ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. కొవిడ్ నేపథ్యంలో నాయకులను నీటి విడుదలకు ఆహ్వానించలేదు. జలాశయం డీఈఈ మాధవి ఆధ్వర్యంలో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది కలిసి సంప్రదాయంగా పూజలు చేసి, నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువకు 100 క్యూసెక్కులు, కుడి కాలువకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని ఆయకట్టుకు విడిచిపెట్టారు. మరోవైపు గ్రేటర్ విశాఖపట్నానికి మరో 50 క్యూసెక్కులు తాగునీటి విడుదల కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 114 మీటర్లు కాగా, ప్రస్తుతం 111.50 మీటర్లు ఉంది. జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా వరినాట్లుకు ఉపయోగించుకోవాలని జలవనరుల శాఖ అధికారులు కోరారు.

ఖరీఫ్ సాగుకు.. రైవాడ సాగునీరు విడుదల

ABOUT THE AUTHOR

...view details