విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేస్తున్న ఉక్కు కార్మికులకు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల ఉక్కు పరిశ్రమ సాధించుకున్నామన్న కృష్ణయ్య.. కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీలకు ఏజెంట్గా మారిందని విమర్శించారు. ఉక్కు కార్మికుల ఉద్యమ స్ఫూర్తికి బీసీ సంఘం పూర్తి మధ్దతు ఇస్తుందని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షకు ఆర్.కృష్ణయ్య మద్దతు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
ఆర్.కృష్ణయ్య