Purandeshwari again fire Jagan Govt: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌పై.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా అరాచక పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. తాజాగా కక్ష్యపూరిత రాజకీయాలకు తేరలేపారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో రాష్ట్ర, ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీ కార్యకర్తలు పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
BJP Social Media Workers Meeting: విశాఖపట్నం జిల్లాలో ఆదివారం బీజేపీసామాజిక మాధ్యమాల వాలంటీర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర అధ్యక్షురాలుపురందేశ్వరి, ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో పాటు మరికొంతమంది పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమక్షంలో పదునైన వ్యాఖ్యలు చేశారు.
Purandeshwari Comments: ''భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రంలోని ఆర్ధిక పరిస్దితులపై ప్రజలకు వాస్తవాలు చెబితే.. దానిని ఖండించడానికి వచ్చిన ఆర్దిక మంత్రి బుగ్గన అన్నీ అబద్దాలు చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది లేదు. పరిశ్రమలు రావడం లేదు. పెట్టుబడుల మాటేలేదు. మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కరువైన పరిస్దితి ఈ రాష్ట్రంలో నెలకొంది. అనాటి రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు.. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ పనులను రాష్ట్రానికి అప్పగిస్తే.. ఈ ప్రభుత్వం ఆ పనులను ఎక్కడ ఉంచిందో ప్రజలే గమనించాలలి.'' అని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.