ఈటీవీ లో ప్రచురితమైన మన్యం దైన్యం కథనానికి మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని చాలా గ్రామాల్లో కొండ లోయలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారిక సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించాలని సబ్ కలెక్టర్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. కొండలు, లోయల్లో నివసించే ప్రజలకు అత్యవసర సమయంలో వైద్యం అందించేందుకు కష్టతరమవుతోందన్నారు. రహదారి సమీపంలో వారికి కాలనీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గిరిజనానికి రహదారుల దగ్గర్లో కాలనీలు: మంత్రి అవంతి - vishaka
గిరిపుత్రుల అభివృద్ధికి సహకరిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాతంలో నివసించే గిరిజనులకు కావల్సిన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
avanthi