ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

News Districts: ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలి: అంబేడ్కర్ జిల్లా సాధన సమితి

Protest For Ambedkar District: దళిత, బహుజనుల కోసం సామాజిక ఉద్యమాలు చేపట్టి, దళితుల ఆశాజ్యోతిగా నిలిచిన అంబేడ్కర్ పేరును ఒక్క జిల్లాకు కూడా పెట్టకపోవటం శోచనీయమని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జిల్లా సాధన సమితి నేత వెంకటరమణ అన్నారు. రాష్ట్రంలో ఒక జిల్లాకు అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలి
ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలి

By

Published : Feb 6, 2022, 6:05 PM IST

Protest For Ambedkar District: రాష్ట్రంలో ఒక జిల్లాకు అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. విశాఖ నగరంలోని ఎల్ఐసీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సమితి ఆధ్వర్యంలో అంబేడ్కర్ జిల్లా ప్రకటించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత గానే కాకుండా, అంబేడ్కర్​కు ఆంధ్ర రాష్ట్రంతో కూడా అనుబంధం ఉందని సాధన సమితి కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ అన్నారు. అంబేడ్కర్ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం, విశాఖ జిల్లా అనకాపల్లిలో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారని గుర్తు చేశారు.

నూతన జిల్లాల ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని..,అయితే దళిత, బహుజనుల కోసం సామాజిక ఉద్యమాలు చేపట్టి, దళితుల ఆశాజ్యోతిగా నిలిచిన అంబేడ్కర్ పేరును ఒక్క జిల్లాకు కూడా పెట్టకపోవటం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాకు అంబేడ్కర్ నామకరణం చేసే వరకు తమ సమితి ఉద్యమాన్ని కొనసాగిస్తుందని వెంకటరమణ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details