ఎన్నికల నేపథ్యంలో మావోల దాడులకు తావు లేకుండా విశాఖ మన్యంలో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రచారాలు జరిగే బహిరంగ ప్రదేశాల్లో కేంద్ర బలగాలు మోహరించాయి. పాడేరు, అరకు, చింతపల్లి, సీలేరు, జీకే వీధి, పెదబయలు వంటి మండల కేంద్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంత్రి శ్రావణ్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలకు భద్రత పెంచారు. డ్రోన్ల సహాయంతో ప్రచారాలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చే వాహనాలను జల్లెడ పడుతున్నారు. ఏజెన్సీ ప్రధాన కేంద్రాల్లో మావోయిస్టు యాక్షన్ టీమ్లు సంచరిస్తున్నాయనీ... అపరిచితులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీ ముఖ్యనేతలు మారుమూల ప్రాంతాల్లో పర్యటించాలంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఎన్నికల నేపథ్యంలో విశాఖ మన్యంలో భారీ భద్రత - భారీ భద్రత
ఎన్నికల నేపథ్యంలో మావోల దాడులకు తావు లేకుండా విశాఖ మన్యంలో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది.
మన్యంలో భారీ భద్రత