ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 18, 2020, 6:37 PM IST

ETV Bharat / state

'ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం పట్టించుకోదా?'

కరోనా ప్రభావం.. ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలను తలకిందులు చేసింది. ఒకటి ,రెండు కాదు ఏకంగా ఏడు నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ప్రైవేట్ పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో.. ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం దాతల ద్వారా సాయం అందిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోని తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

private school teachers struggled
ప్రైవేట్ ఉపాధ్యాయులను పట్టించుకోని ప్రభుత్వం

కొవిడ్​ కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 7 నెలలుగా స్కూల్స్ మూసి వేయటంతో, జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. తిరిగి ప్రైవేట్ పాఠశాలలు తెరిచే సూచనలు కనిపించక పోవటంతో ఆందోళన చెందుతున్నారు. కొంతమంది దాతలు వీరికి కిరాణా వస్తువులు అందించి సాయం చేస్తున్నారు. ఈ టీచర్స్ తమ సమస్యలను పరిష్కరించుకోవటం కోసం పీఎల్​టీయూ ప్రైవేట్ టీచర్స్ లెక్చలర్స్ యూనియన్ ఏర్పాటు చేశారు.

విశాఖ అనకాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల టీచింగ్, నాన్ - టీచింగ్ స్టాఫ్ కు... 1991_95 వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ హైదరాబాద్ పూర్వ విద్యార్థుల సహకారం, మరికొంత మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సాయంతో కిరాణా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దాతల పరంగా సాయం అందుతున్నా.. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఉపాధ్యాయులు వాపోతున్నారు.

కరోనాతో అందరికంటే తామే తీవ్రంగా నష్టపోయామని ఇలాంటి సమయంలో... ఇటు యాజమాన్యాలు కానీ , అటు ప్రభుత్వం గానీ తమను ఆదుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రైవేటు టీచర్స్​ కోరుతున్నారు.

ఇదీ చదవండి:

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం

ABOUT THE AUTHOR

...view details