ప్రతిపక్షపార్టీలవి సరికొత్త దొంగతనాలు: అయ్యన్నపాత్రుడు - vishaka
ప్రతిపక్ష పార్టీలు సరికొత్త దొంగతనాలకు తెరలేపుతున్నాయని మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. డబ్బు, నగలు దోచుకునేవారిని చూశాం కానీ... ప్రస్తుతం ఓట్లను దొంగతనం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రచారంలో అయ్యన్న పాత్రుడు
డబ్బు, నగదు దొంగిలించే వారిని చూశాంకానీ... ఓట్లను దొంగిలించే నాయకులను ఈ మధ్యే చూస్తున్నామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం కొత్త లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు అధికారం దక్కదనే బాధతోనే ఓట్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత రోజుల్లో మన ఓటు ప్రతి పూట పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.