మహానగరంలో మాయగాడు... మంత్రిని కలిసిన బాధితులు - srinivas
ప్రభుత్వ గృహాలు మంజూరు చేయిస్తామని నమ్మించి విశాఖ వాసులను మోసం చేశాడో ఓ వ్యక్తి. ఒక్కొక్కరి నుంచి 2 లక్షల చొప్పున సుమారు 3 కోట్ల వరకు దండుకున్నాడు. అతని చేతిలో మోసపోయామని తెలుసుకున్న బాధితులు... రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ని కలిసి తమ గోడు చెప్పుకున్నారు.
విశాఖలో ఓ వ్యక్తి చేతిలో వందల మంది మోసపోయారు. ప్రభుత్వ గృహాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి సుమారు 2 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి నగరంలోని ఫైనాపిల్ కాలనీలో నిర్మాణంలో ఉన్న గృహాలను చూపించి... వాటిని మంజూరు చేస్తామని ప్రజలను మోసగించాడు. నకిలీ పత్రాలు స్పష్టించి వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేశాడు. ఈనాడు పత్రికలో అతనిపై వచ్చిన వార్తలు చూసి మోసపోయామని బాధితులు గ్రహించారు. నగరంలోని ఒకటి, రెండు, నాల్గొవ పట్టణ పోలీస్ స్టేషన్లలో ప్రశాంత్‌కుమార్‌పై ఫిర్యాదుచేశారు. తమకి జరిగిన మోసాన్ని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌కు వివరించి .. సీపీఐ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడారు.