Jagananna colonies ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీలకు విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. అధికారులు ఒత్తిడితో అప్పులు చేసి కొందరు ఎలాగోలా ఇంటి నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశం చేశారు. ఇంట్లో దిగి ఏడాది దాటినా... కరెంటు సౌకర్యం లేక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 906 లేఔట్లకు గాను 269 లేఔట్లకి ప్రాధాన్య క్రమంలో ఎంచుకొని విద్యుదీకరణ పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 85 చోట్ల పనులు ప్రారంభించగా ఈ నెలాఖరులోగా 25, మిగతావి సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ప్రస్తుతానికి 35 వేల విద్యుత్తు స్తంభాలు, 3వేలమంది విద్యుత్ సిబ్బంది అవసరమని అధికారులు చెబుతున్నారు. విద్యుదీకరణ పనులు వేగవంతం పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Jagananna colonies జగనన్న కాలనీల్లో కరెంట్ కష్టాలు
Jagananna colonies జగనన్న కాలనీల్లో విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కష్టపడి ఇళ్లు నిర్మించుకుని గృహ ప్రవేశం చేసి ఏడాది గడిచినా ఇంకా కరెంట్ సదుపాయం లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి విద్యుత్ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.
జగనన్న కాలనీలు