విశాఖ జిల్లా చోడవరం పంచాయతీ శివారు ఫకీరుసాహెబ్ పేటలో నాగిరెడ్డి సుబ్రహ్మణ్యం ఇంట్లో షార్ట్ సర్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో దాచిన రూ.50,000 నగదు కాలి బూడిదయ్యింది. సుబ్రహ్మణ్యం కుమారులిద్దరివి డిగ్రీ, ఇంటర్ ధ్రువపత్రాలు కాలిపోయాయి. సామగ్రి కాలి బొగ్గుగా మారింది. ఆర్ఐ, విఏవో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
విద్యుదాఘాతంతో బూడిదైన నగదు, ధ్రువపత్రాలు - crime news in vizag
విద్యుదాఘాతం కారణంగా విశాఖ జిల్లా చోడవరం పంచాయతీ శివారులోని ఓ ఇంట్లో నగదు కాలిపోయింది. ఇంటర్, డిగ్రీ ధ్రువపత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
power circuit in visakha dst chodavaram panchayathi cash and papers smashed completely