విశాఖ ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. అనకాపల్లి సుంకరమెట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. లారీలో ఐరన్ ఫ్రేమ్ మధ్య తరలిస్తున్న 240 కిలోల గంజాయిని గుర్తించారు.
ఈ సరుకు విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ భాస్కర్ తెలిపారు. కోయంబత్తూర్కు చెందిన మణిరాజ్, ఫళని వేలు, పెద్దపల్లికి చెందిన చల్లంగిరాజులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వాహనాన్ని సీజ్ చేశామన్నారు.