విశాఖ జిల్లా పెందుర్తిలో 60 లక్షలు విలువ చేసే గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి ఉత్తరప్రదేశ్‌కు కంటైనర్‌లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. కంటైనర్ డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురిని ఆదుపులో తీసుకున్నారు. వారిని విచారించి విశాఖకు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2,652 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. దాని విలువ 60 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను కరోనా పరీక్షలు చేయించి రిమాండ్‌కు తరలించారు.
GANJAI SMUGGLING: రూ. 60 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత - విశాఖపట్నం ముఖ్యంశాలు
విశాఖ జిల్లా పెందుర్తిలో 60 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
విశాఖ జిల్లాలో గంజాయి పట్టివేత