ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు - విశాఖ జిల్లా నేర వార్తలు

విశాఖ జిల్లా రోలుగుంట, గొలుగొండ మండలాల్లోని నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే సరకులను స్వాధీనం చేసుకున్నారు.

నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

By

Published : Mar 17, 2021, 12:36 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం పెద్దపేట, గొలుగొండ మండలం చెన్నయ్యపాలెంలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. సుమారు రెండు వేల లీటర్ల బెల్లం ఊటను ద్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే సరకులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులను ముందుగానే పసిగట్టిన తయారీదారులు తప్పించుకున్నారు. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని రోలుగుంట ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి: విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు ఐఎస్ఓ గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details