విశాఖలో గత నెల 28న జరిగిన శిరోముండనం కేసులో అరెస్టయిన ఏడుగురిలో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నూతన్‌నాయుడు భార్య ప్రియమాధురితో పాటు బ్యూటీషియన్ ఇందిరారాణి, సూపర్‌వైజర్ వరహాలును విచారించేందుకు పోలీసులకు న్యాయస్థానం రెండు రోజులు గడువు ఇచ్చింది. దీంతో ఈ ముగ్గురిని పెందుర్తి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. కేవలం చరవాణి కోసమే శిరోముండనం చేయాల్సి వచ్చిందా...లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారించినట్లు సమాచారం. నూతన్‌నాయుడుని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి పొందడంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
శిరోముండనం కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులు - police investigation in head tonsure case
విశాఖలో జరిగిన శిరోముండనం కేసులో అరెస్టయిన ఏడుగురిలో... ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేపట్టిన పోలీసులు ఈరోజూ విచారించనున్నారు.
శిరోముండనం కేసులో నిందితులను విచారించిన పోలీసులు