విశాఖ నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లోని శాంతిభద్రతల విభాగంలో విధులు నిర్వహిస్తున్న కే.టీ.వీ.రమేశ్... తెలుగు భాష, సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఓ పాట రాసి పలువురి ప్రశంసలు పొందారు. ఆ పాటను చూసిన డీజీపీ గౌతమ్ సవాంగ్... మరికొన్ని పాటలు రాయమని ప్రోత్సహించారు. ఈ క్రమంలో రమేశ్... ‘సమరం, శౌర్యం, మరణం, అమరం, పేరిట ఓ పాటను రాశారు. పాటకు బాణీలు అందించి, సంగీతాన్ని సమకూర్చారు. పోలీసు విధి నిర్వహణపై స్పష్టమైన అవగాహన ఉండటంతో తన ఆలోచనలకు తగ్గట్టుగా పాట రాసి పలువురి ప్రశంసలు పొందారు.
పోలీస్ అమరవీరులపై కానిస్టేబుల్ పాట - విశాఖపట్నం నేటి వార్తలు
విశాఖ నగర పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కేటీవీ రమేశ్... పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఒక పాట రాశారు. దానికి సంగీతం సమకూర్చడమే కాకుండా... స్వయంగా పాడి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ పాటను రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్... మంగళవారం అమరావతిలో విడుదల చేశారు.
పోలీస్ అమరవీరులపై పాట రాసిన కానిస్టేబుల్
పాటకు అవసరమైన వీడియో చిత్రీకరణను ఇతరుల సహాయంతో పూర్తి చేశారు. పోలీసుగానూ నటించి తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. విధి నిర్వహణలో ఎదుర్కొనే కష్టాలను వీడియోలో పొందుపరిచారు. నగరంలోని బీచ్‌రోడ్డు పోలీసు అమరవీరులస్థూపం, సాగర్‌నగర్, కైలాసగిరిలోని జిల్లా ఎ.ఆర్.దళ్ ప్రాంగణం, తొట్లకొండ గ్రేహౌండ్స్ ప్రాంగణాల్లో పాటను చిత్రీకరించారు.
ఇదీచదవండి.