విశాఖ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆరుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ సమయంలో కొంతమంది నక్సల్స్ తప్పించుకున్నారన్న సమాచారంతో..ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. జి.మాడుగుల మండలం నుర్మతి, మద్దిగరువు అటవీ ప్రాంతంలో CRPF, పోలీసులు సంయుక్తంగా గాలిస్తున్నారు.
అనుమానిత వాహనాలను జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ బృందాలు మందుపాతరలపై దృష్టి సారించాయి. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానిక గిరిజనులకు పోలీసులు సూచించారు.