విశాఖ మన్యం జి.మాడుగుల మండలం బంధ వీధి సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 80 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేయగా.. మరో వ్యక్తి పరారయ్యాడు. వీరి వద్ద నుంచి 16 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జి.మాడుగుల మారుమూల ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని సీఐ దేవుడుబాబు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ మూడు లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గంజాయి రవాణాలో ఇద్దరు అరెస్టు.. మరో వ్యక్తి పరారీ - పోలీసుల తనిఖీలు తాజా వార్తలు
విశాఖ మన్యం జి.మాడుగులలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు మూడు లక్షలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారైనట్లు వెల్లడించారు.
అక్రమ గంజాయి రవాణాలో ఇద్దరు అరెస్టు