Drugs Seized in Visakhapatnam: విశాఖలో మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని యువతకు మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వెలంపేటకు చెందిన ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి.. ఖరగ్‌పూర్ నుంచి మత్తు ఇంజక్షన్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి 490 మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖరగ్‌పూర్‌లో ఒక్కో ఇంజక్షన్ 50 రూపాయల చొప్పున కొనుగోలు చేసి.. స్థానికంగా 200 నుంచి 300 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విశాఖలో నిషేధిత మత్తు ఇంజక్షన్లు స్వాధీనం.. - drugs in visakhapatnam
Drugs Seized in Visakhapatnam: మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని విశాఖలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి భారీగా మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్ ఇంజక్షన్లు