విశాఖ డుంబ్రిగూడ మండలం లో అరమ ప్రాథమిక పాఠశాలను ఐటీడీఏ పీవో బాలాజీ ఆకస్మిక తనిఖీ చేశారు.విద్యార్దులు పాఠశాల సమయంలో ఆడుకోవడంతో ఉపాధ్యాలపై ఆరా తీశారు.ఉపాధ్యాయులు రాలేదనే సమాచారం రావడంలేదని,తరచు గైర్హజరీ అవుతుంటారని బాలాజీ దృష్టికి వచ్చింది.దీంతో సదరు ఉపాధ్యాయులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన శ్యామలాదేవి,చంద్రశేఖర్ అనే ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు విధించారు.
నిర్లక్ష్యానికి మూల్యం..ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు - dumbriguda
గురుపూజ దినోత్సవం నాడు కూడా పాఠశాలకు హజరు కాని ఇద్దరు ఏజెన్సీ ఉపాధ్యాయులపై విశాఖ పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బాలాజీ సస్పెన్షన్ వేటు విధించారు.
ఐటీడీఏ పీవో