ప్రధాని మోదీ పర్యటనపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో చెప్పారు.కియా పరిశ్రమను గుజరాత్‌కు తరలించేందుకు మోదీ విశ్వ ప్రయత్నాలు చేశారన్నారు. ప్రధాని హోదాలో ఉండి నరేంద్ర మోదీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా... చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో కియా పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందన్నారు. విభజన హామీల అమలులో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రజలంతానిరసన తెలుపుతున్నారని స్పష్టం చేశారు.