అటవీ సంపదను దోచుకోవడానికి విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు నాలుగు వరుసల రహదారి వేస్తున్నారా? అంటూ గిరిజనులు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని మూడు గ్రామాల మీదుగా రోడ్డు వేస్తున్నారని.. దీనికి సరైన పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'అడవి సంపదను దోచుకునేందుకు రోడ్డు వేస్తున్నారా?' - రహదారి పనులు
రూ. 2200 కోట్లతో విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్ వరకు ప్రభుత్వం వేస్తున్న నాలుగు వరుసల రహదారి ఎవరికోసమంటూ విజయనగరం జిల్లా పాచిపెంట మండల ప్రజలు ధర్నా చేపట్టారు. మూడు గ్రామాల మీదుగా రోడ్డు వేస్తున్నారని.. దీనికి సరైన పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విజయనగరం
రూ. 2200 కోట్లతో విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్ వరకు ప్రభుత్వం నాలుగు లైన్ల రోడ్డును నిర్మిస్తోంది.
ఇదీ చదవండి:నిండు గర్భిణి.. మూడు కిలోమీటర్లు నడిచినా...!