విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నకు పెళ్లిచూపులు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని ఏప్రిల్ 4న జరపాలని నిర్ణయించారు. తొలుత స్వామివారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి మెట్ల మార్గం ద్వారా పుష్కరిణి కల్యాణ మండపానికి తీసుకొచ్చి ఈ పెళ్లి చూపుల ఉత్సవం నిర్వహించారు. తర్వాత డోలోత్సవం జరిపారు. స్వామివారి కల్యాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లిచూపుల ఉత్సవంలో ఆలయ ఛైర్ పర్సన్ సంచైత గజపతిరాజు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వైభవంగా సింహాద్రి అప్పన్న స్వామివారి పెళ్లిచూపులు
సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి పెళ్లిచూపుల కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ఏప్రిల్ 4న స్వామివారి కల్యాణం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బుగ్గన చుక్క పెట్టుకొని స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
pellichoopulu usthavam grandly organized in simhachalam temple