ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దేరు జలాశయంలో గరిష్ట స్థాయికి నీటిమట్టం.. అప్రమత్తమైన అధికారులు

విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి నీరు పెద్ద ఎత్తున జలాశయానికి చేరుకోవటంతో అప్రమత్తమైన అధికారులు.. స్పిల్ వే గేట్లు ఎత్తి 186 క్యూసెక్కుల అదనపు నీటిని దిగువకు వదిలారు.

By

Published : Dec 23, 2020, 7:42 PM IST

pedderu reservoir pillway gates open and water released
గరిష్ట స్థాయికి పెద్దేరు జలాశయం నీటిమట్టం

ఎగువ నుంచి వస్తున్న ఊట నీటితో.. విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. జిల్లాలో వర్షాలు లేకపోయినప్పటికీ.. ఎగువ ప్రాంతాల నుంచి నీరు నిర్విరామంగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయి వద్ద నిలకడగా ఉంది. అదనంగా నీరు జలాశయంలోకి రావటంతో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. నీటి మట్టం పెరగటంతో అప్రమత్తమైన అధికారులు.. జలాశయం గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువ నదిలోకి విడిచిపెడుతున్నారు.

ఎగువ నుంచి 30 క్యూసెక్కుల వరకు ఊట నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా.. ప్రస్తుతం 136.60 మీటర్లకు చేరుకుంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ప్రధాన స్పిల్ వే గేట్లు ఎత్తి 186 క్యూసెక్కుల అదనపు నీటిని దిగువ విడిచిపెట్టారు.

ఇవీ చూడండి..

మాచ్​ఖండ్​కు మహర్దశ... జనరేటర్ల ఆధునీకరణకు సన్నాహాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details