ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో కలకలం స్పష్టిస్తున్న శాంతి స్థూపాలు - agency

విశాఖ మన్యంలో శాంతి స్థూపాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న వేళ వీటిని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

మన్యం

By

Published : Jul 29, 2019, 6:16 AM IST

విశాఖ ఏజెన్సీలో నిన్నటి నుంచి మావోయిస్టుల అమ‌ర వీరుల వారోత్స‌వాలు ప్రారంభమయ్యాయి. విప్ల‌వంలో అమ‌రులైన వారికి నివాళ‌ులు అర్పించి వారి గుర్తుగా మావోయిస్టులు ఎర్రని స్థూపాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే మారు మూల గిరిజన పల్లెల్లో శాంతి స్థూపాలు వెల‌వ‌టంతో ఏవోబీలో ఉద్రిక్త‌త ప‌రిస్థ‌తి నెల‌కొంది. జూలై 28 నుంచి ఆగ‌స్టు 3 వ‌ర‌కూ ప్ర‌తీ యేటా మావోయిస్టులు అమ‌ర‌వీరుల వారోత్స‌వాలు నిర్వ‌హించ‌డం ప‌రిపాటి. మరణించిన కామ్రేడ్ల్ పేరు మీద ఎర్రని స్థూపాలు ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం మావోలే ఖంగుతినేట్లుగా తెల్లని స్థూపాలు వెలిశాయి. మావోల చేతిలో మరణించిన అమాయక గిరిజనుల పేర్లను ఈ స్థూపాలపై ఉన్నాయి. 'మావోయిస్టులని ఎదిరించి వాళ్ల చేతిలో అమరులైన గిరిజనులకు జోహార్లు' అని పేర్కొన్నారు.

రవాణా సౌకర్యం కూడా లేని మారుమూల ప్రాంతమైన కోరుకొండలో
ఆదివారం ఈ శాంతి స్థూపాలు ప్రత్యక్షమయ్యాయి. గిరిజ‌న అభ్యుద‌య సంఘం పేరిట ఈ స్థూపాల్ని అమర్చారు. మ‌రోవైపు కోరుకొండ ప‌రిస‌ర ప్రాంతాల్లో గ‌తంలో అమ‌ర‌వీరుల పేరిట నిర్మంచిన స్థూపాల‌కు రంగులేసి వారోత్స‌వాల‌కు మావోయిస్టులు సిద్ధం చేశారు. మావోయిస్టులు చ‌ర్య‌ల‌ను నిల‌వ‌రించ‌డానికి పోలీసులు స‌రిహద్దులో పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details