ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గించాలి' - తల్లిదండ్రుల ఆందోళన

ప్రైవేటు పాఠశాలల ఫీజులు తగ్గించాలని విశాఖలోని విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళన... రెండో రోజుకు చేరింది. ఫీజులు తగ్గించేంత వరకు తమ నిరసన విరమించబోమని వారు స్పష్టం చేశారు.

agitation on high school fee
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

By

Published : Jan 30, 2021, 10:56 AM IST

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు తగ్గింపును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డీఈవో కార్యాలయం వద్ద తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకి చేరగా.. రాత్రైనా, చలిలోనే నిరసన కొనసాగించారు.

ప్రైవేటు పాఠశాలల్లో 30 శాతం ఫీజు తగ్గించాలని ప్రభుత్వం జీవో నెం.57ను జారీ చేసిందని వారు గుర్తు చేశారు. యాజమాన్యాలు కచ్చితంగా ఆ జీవోను అమలు చేయాలని, ఫీజులు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details