విశాఖ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల నియామక పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 180 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 60 వేల 651 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలు
విశాఖలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలూ జరిగాయి. నగరంలోని 15 కేంద్రాల్లో నిర్వహించారు. 6 వేల 500 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్నందున వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు పెద్దఎత్తున విశాఖకు చేరుకున్నారు.
ఒకే రోజు రెండు పరీక్షలు.. విశాఖకు అభ్యర్థుల క్యూ - డిఫెన్స్
ఒకేరోజు రెండు పరీక్షలు.. విశాఖలో పంచాయతీ కార్యదర్శి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు నగరానికి క్యూ కట్టారు.
ఒకే రోజు రెండు పరీక్షలు.. విశాఖకు అభ్యర్థుల క్యూ
ఇవీ చదవండి..