విశాఖ ఏజెన్సీలో మవోయిస్టులు ప్రకటించన బంద్ ప్రభావం.. అంతగా లేదని పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో సిబ్బందితో కట్టుదిట్టంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి ఆటంకంగా మావోయిస్టులు నిలుస్తున్న కారణంగానే... గిరి పుత్రులు వారికి సహకరించటం లేదని అభిప్రాయపడ్డారు. యువత గ్రామాలు దాటి బయటకు వెళ్లకూడదని మావోయిస్టులు సూచిస్తున్న తీరుకు.. వ్యతిరేకత ఎదురవుతోందని చెప్పారు. రహదారులు, సమాచార వ్యవస్థను దెబ్బతీస్తున్న మావోలకు గిరిజనులు సాయం చేయటం లేదని తెలిపారు. ప్రస్తుతం బంద్ ప్రభావం లేదనీ, ఏజెన్సీలో యథాతథంగానే గిరిజనులు రోజువారి పని చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.
ఏవోబీలో.. బంద్ ప్రభావం లేదు: పాడేరు డీఎస్పీ - " బంద్ ప్రభావం లేదు"
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు నేడు ప్రకటించన బంద్ ప్రభావం లేదని పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ స్పష్టం చేశారు.
" బంద్ ప్రభావం లేదు"