ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాట్సాప్​లో పెద్ద ఎత్తున పోస్టులు.. పోలీసుల అదుపులో యువకుడు - విశాఖ రైల్వే స్టేషన్​లో పోలీసుల అదుపులో యువకుడు

Agnipath Agitation: విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని పోలీసులు గుర్తించారు. స్టేషన్​కు ఏ మార్గం ద్వారా చేరుకోవాలో.. వాట్సాప్​లో పెద్ద ఎత్తున పోస్టు చేస్తున్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను మూసివేశారు.

one youngster is being investigated by police over posting the way to enter into vishaka railway station
పోలీసుల అదుపులో యువకుడు

By

Published : Jun 18, 2022, 12:32 PM IST

అగ్నిపథ్‌ ఆందోళనల కారణంగా శుక్రవారం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం చోటు చేసుకున్న నేపథ్యంలో.. రైల్వే శాఖ మరింత అప్రమత్తమైంది. అగ్నిపథ్‌ సెగ ఆంధ్రప్రదేశ్‌కి తగలకుండా ఉండేందుకు రైల్వే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానస్పదంగా ఉన్న ఓ యువకుడిని పోలీసులు గుర్తించారు. స్టేషన్​కు ఏ మార్గం ద్వారా చేరుకోవాలో.. వాట్సాప్​లో పెద్ద ఎత్తున పోస్టు చేస్తున్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. కాగా, మరోవైపు విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ దువ్వాడ వద్ద, హవ్‌డా నుంచి వచ్చే వాటిని కొత్తవలస వద్ద నిలిపివేసి, దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

విశాఖ రైల్వే స్టేషన్‌కు రైళ్లు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే స్టేషన్‌కు అర కిలోమీటర్‌ మేర ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. విశాఖ భద్రతా వ్యవహారాలను సీపీ శ్రీకాంత్‌ స్వయంగా పరిశీలిస్తున్నారు.మద్దిలపాలెం , హనుమంత వాక దగ్గర పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details