విశాఖ జిల్లా నలుమూలల నుంచి హాజరైన కేరళీయులు, స్థానికులతో.. ఓనం సంబరాలు అంబరాన్నంటాయి. కంచరపాలెం కేరళ కళాసమితి వేదికగా నిర్వహించిన ఈ వేడుకల్లో.. వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కేరళీయులు అతిథులుగా హాజరయ్యారు. మలయాళీలు.. సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఓనం సాంప్రదాయ నృత్యాలతో పాటు కేరళ యువతులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. బలి చక్రవర్తి వేషధారణతో ఆశీస్సులు అందించడంతో వేడుకలు ముగిశాయి.
సంప్రదాయాన్ని చాటి చెప్పేలా ఓనం వేడుకలు - kerala
విశాఖలో ఓనం వేడుకలు వైభవంగా జరిగాయి. కంచరపాలెం కేరళ కళా సమితి వేదికగా సంబరాలు అంబరాన్నంటాయి.
ఓనం వేడుకలు