ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయం చేయాలంటూ నర్సుల ఆందోళన

కరోనా సమయంలో కాంట్రాక్ట్ పద్దతిలో సేవలందించిన నర్సులు విశాఖలో ఆందోళనకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వందల మంది నిరసన తెలిపారు. అత్యవసర సమయంలో తమను విధుల్లోకి తీసుకొని ఇప్పుడు అర్ధంతరంగా తొలిగించటం అన్యాయమన్నారు. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Nurses protest for jobs
న్యాయం చేయాలంటూ నర్సులు ఆందోళన

By

Published : Nov 30, 2020, 1:06 PM IST

అన్యాయంగా తమను విధుల్లోంచి తొలిగించారని.. తక్షణనమే తిరిగి పనిలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ.. నర్సులు ఆందోళన చేపట్టారు. వీరంతా.. కరోనా సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన సేవలందించారు. తమను అర్ధంతరంగా విధుల్లోంచి తప్పించారంటూ.. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.

కరోనా సమయంలో పని చేసిన కాలానికి బకాయిపడ్డ జీతాలు చెల్లించకపోగా.. విధుల నుంచి తప్పించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలను వెంటనే చెల్లించాలని.. తమను యథాతథంగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details