ఇంకా పూర్తిగా వేసవి రాకముందే.. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. కొద్దిరోజుల క్రితం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 114 మీటర్ల మేర ఉండగా.. ప్రస్తుతం నీటిమట్టం 107.55 మీటర్లకు పడిపోయింది. ఒకప్పుడు జలాశయం ప్రధాన స్పిల్ వే గేట్ల వద్ద జలకళ సంతరించుకోగా.. ప్రస్తుతం గేట్ల వద్ద నీరు లేక వెలవెలబోతోంది.
రైవాడ జలాశయం: నాడు కళకళ.. నేడు వెలవెల!
ఒకప్పుడు నిండుకుండను తలపించిన విశాఖ జిల్లాలోని రైవాడ జలాశయం.. ఇప్పుడు నీరులేక వెలవెలబోతోంది. జలాశయంలో నీరులేక అడుగంటుపోయింది.
రైవాడ జలాశయం