మొట్ట మొదటిసారి... కోనాం రిజర్వాయర్ ఖాళీ - summer
వర్షాభావ పరిస్థితులకు విశాఖ జిల్లాలో ప్రధానమైన కోనాం రిజర్వాయర్ పూర్తిగా అడుగంటి పోయింది. నీరు లేక డెడ్ స్టోరేజ్ దశకు చేరుకుంది.
కోనాం రిజర్వాయర్
విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని కోనాం రిజర్వాయర్ వర్షాభావంతో అడుగంటి పోయింది. పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్ల కాగా ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ దశకు చేరుకుంది. జలాశయం నుంచి చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం మండలాలకు 14 వేల 450 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం నీరు లేనందున ఈ ప్రభావం ఖరీఫ్‌పై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో ఇంతలా నీటిమట్టం పడిపోవడం... మునుపెన్నడూ లేదని ఆయకట్టు రైతులు అంటున్నారు.