ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదంలో.. బాస్కెట్​బాల్ జాతీయ క్రీడాకారుడు దుర్మరణం - విశాఖ జిల్లా వార్తలు

రైల్వే ఉద్యోగి, జాతీయ బాస్కెట్​బాల్ క్రీడాకారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశాఖ జిల్లా కశింకోట మండలం నూతనగుంటపాలెం జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

National basketball player Jangam Tarun Kumar (36) died in a road accident.
రోడ్డు ప్రమాదంలో జాతీయ బాస్కెట్​బాల్ క్రీడాకారుడి దుర్మరణం

By

Published : Jan 16, 2021, 7:38 AM IST

రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి, జాతీయ బాస్కెట్​బాల్ క్రీడాకారుడు జంగం తరుణ్​కుమార్(36) దుర్మరణం చెందారు. విశాఖ జిల్లా కశింకోట మండలం నూతనగుంటపాలెం జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కశింకోట అదనపు ఎస్సై జె.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక సమీపంలోని వడ్లపూడికి చెందిన తరుణ్ కుమార్ సంక్రాంతికి భార్య దుర్గాలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల కిందట గుంటూరులో అత్తవారింటికి వెళ్లారు.

గురువారం రాత్రి తిరిగి ఒక్కరే కారులో వడ్లపూడి బయల్దేరారు. నూతన గుంటపాలెం కూడలి వద్ద కారు అదుపు తప్పి బస్సు షెల్టరును ఢీకొట్టి, పక్కనే ఉన్న గోతిలోకి బోల్తాపడింది. కారు నడుపుతున్న తరుణ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. బాస్కెట్​బాల్ జాతీయ క్రీడాకారుడైన తరుణ్​కుమార్​కు 2009లో క్రీడాకోటాలో రైల్వేల్లో ఉద్యోగం రావటంతో వాల్తేరు డివిజన్​లో డీజిలో లోకోషెడ్​లో గ్రూపు-3 పోస్టులో చేరారు. ప్రస్తుతం రైల్వే బాస్కెట్​బాల్ జట్టుకు శిక్షకుడిగా ఉంటూ దువ్వాడ రైల్వేయార్డులో పనిచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details