ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంత భవనానికి మోక్షం ఎప్పుడో...! - నర్సీపట్నం వార్తలు

సొంత భవనం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని నర్సీపట్నం ఎక్సైజ్ అధికారులు వాపోయారు. ఉన్న కొద్ది స్థలంలోనే పట్టుబడిన వాహనాలు, స్వాధీనం చేసుకున్న గంజాయిని నిల్వ చేశామన్నారు. స్థలం లేక విధులు నిర్వహించటానికి అవస్థలు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలన్నారు.

officials problems
అధికారుల అవస్థలు

By

Published : Jun 23, 2021, 3:08 PM IST

సొంత భవనానికి మోక్షం ఎప్పుడో...!

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పాతికేళ్లకు పైగా అద్దె భవనంలో నడుస్తోంది. సొంత భవనం లేకపోవటంతో అద్దె భవనంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అధికారులు తెలిపారు. గతంలో సొంత భవనం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించినప్పటికీ పనుల్లో పురోగతి లేదన్నారు. ఉన్న కొద్ది స్థలంలోనే వివిధ కేసుల్లో సీజ్​ చేసిన 290 వాహనాలున్నాయన్నారు. మరో వైపు 21టన్నుల కిలోల గంజాయి నిల్వ ఉందన్నారు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఇరుకుగా విధులను నిర్వహిస్తూ.. వాటిని పరిరక్షిస్తూ అవస్థలు పడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details