ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నంలో మరోసారి కరోనా కలవరం - red zones in narsipatnam

విశాఖ జిల్లా నర్సీపట్నంలో మరోసారి కరోనా కలవరం రేగింది. తాజాగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు స్థానికులలో ఆందోళన రేపుతోంది. దీంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని కొన్ని వార్డులని రెడ్ జోన్లుగానే కొనసాగిస్తున్నారు.

vishaka district
నర్సీపట్నంలో మరోసారి కరోనా కలవరం

By

Published : May 16, 2020, 12:15 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో మరోసారి కరోనా కలవరం రేగింది. పట్టణంలోని గవర వీధిలో మరో పాజిటివ్ కేసును వైద్యులు గుర్తించడంతో ప్రజల్లో ఆందోళన చోటుచేసుకుంది.

నర్సీపట్నానికి సంబంధించి గతనెలలో మూడు పాజిటివ్ కేసులను గుర్తించిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని కొంతమంది ముస్లింలు నర్సీపట్నంలో కొద్దిరోజుల పాటు బస చేయడం వల్ల రెండు విడతలుగా 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని 22 , 23 , 24 , వార్డులను రెడ్ జోన్ గా ప్రకటించారు. దీంతో పాటు స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరీక్షలను కొనసాగిస్తున్నారు. రెడ్​జోన్ నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ ఈనెల 17తో ముగియనుంది. కానీ 15వ తేదీన మరో పాజిటివ్ కేసును గుర్తించడంతో పట్టణంలో కలవరం మొదలైంది. ఈ ప్రభావంతో మరెన్ని రోజులు రెడ్ జోన్ తో అవస్థలు పడాలోనని ఆందోళన చెందుతున్నారు.

ఇది చదవండిసీఎం సహాయ నిధికి దాతల చేయూత

ABOUT THE AUTHOR

...view details