'నాడు-నేడు పనులు సత్వరం పూర్తి కావాలి' - naadu-needu Things need to be done quickly
పాఠశాలల రూపురేఖలు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనులు సత్వరం పూర్తి కావాలని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి ఆదేశించారు.
నాడు నేడు పనులు సత్వరం పూర్తి కావాలి
విశాఖ జిల్లా నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ తదితర మండలాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి క్షుణ్ణంగా పరిశీలన చేశారు. పనుల్లో నాణ్యత లోపిస్తే క్షమించేది లేదని డీఈవో హెచ్చరించారు. ఉపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్ పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి.. త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
ఇదీ చదవండిప్రమాదవశాత్తు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి