ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్ల పరిశీలన - మున్సిపల్ ఎన్నికల లెక్కింపు వార్తలు

విశాఖ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను.. కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్​తో కూడిన అధికారుల బృందం పరిశీలించింది. స్ట్రాంగ్​ రూం వద్ద భద్రతపై అధికారులు ఆరా తీశారు.

counting
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లు పరిశీలన

By

Published : Mar 13, 2021, 11:32 AM IST

విశాఖ మహా నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రాత్రిళ్లు స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత, లెక్కింపు ప్రక్రియ కోసం చివరి నిమిషంలో చేయాల్సిన పనులను.. కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మితో కూడిన అధికారులు బృందం పరిశీలించింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో.. 98 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. బాక్సులను తెరిచిన దగ్గర నుంచి వాటిని ఎక్కడ భద్రపరచాలన్న వంటి అంశాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను అధికారుల బృందం పరిశీలించింది.

ABOUT THE AUTHOR

...view details