ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కు ఉద్యమం..ఈనెల 29న 10వేల మందితో మానవహారం - విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకానికి వ్యతిరేకంగా ఈ నెల 29న మానవహారం నిర్వహించున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తెలిపింది. కార్మికులు, నిర్వాసితులు పాల్గొనాలని పిలుపునిచ్చింది.

విశాఖ ఉక్కు
విశాఖ ఉక్కు

By

Published : Aug 25, 2021, 11:07 AM IST

Updated : Aug 25, 2021, 12:20 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకానికి వ్యతిరేకంగా ఈ నెల 29న 10 వేలమందితో మానవహారం నిర్వహించనున్నట్లు ప్రకటించింది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తెలిపింది. అగనంపూడి నుంచి బీహెచ్​పీవీ వరకు 10 కిలో మీటర్లు మానవ హారం లో 10 వేల మంది కార్మికులు, నిర్వసితులు పాల్గొంటారు అని ఐక్య పోరాట కమిటీ సభ్యులు తెలిపారు. 30 న సాయంత్రం 6 గంటల నుంచి పెదగంట్యాడలో క్యాండిల్ ర్యాలీ ఉంటుందని వెల్లడించారు.

విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి ఏడు నెలలని పోరాట కమిటీ కన్వీనర్ అయోద్యరాం ..గాజువాక సీఐటీయూ ఆఫీసులో విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్లాంట్​ను పరిరక్షించేందుకు వందమంది ఎంపీల నుంచి సంతకాల సేకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు

ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు కర్మాగారం. 32 మంది ప్రాణ త్యాగాలు, అవిశ్రాంత ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న పరిశ్రమగా ఖ్యాతి ఉంది. దేశంలో తీర ప్రాంత ఉక్కు కర్మాగారం ఇదొక్కటే. ఉక్కు పరిశ్రమ అంటే లాభ నష్టాల గణాంకాలు, రాజకీయ సమీకరణాలు కాదు.అమృతరావు వంటి త్యాగధనుల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం. భూమే సర్వస్వంగా భావించే రోజుల్లో పారిశ్రామికీకరణపై అవగాహన లేని కాలంలో.. వేల మంది తమ సాగు భూములను త్యాగం చేశారు. పునరావాసం, ఉద్యోగం హామీతో. నామమాత్రపు పరిహారం తీసుకుని.. సరికొత్త అధ్యాయానికి నాటి రైతులు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి అనేక అడ్డంకుల్ని అధిగమిస్తూ.. ఆటుపోట్లను తట్టుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌... ప్రైవేటుకి దీటుగా నిలిచింది. కానీ ప్రస్తుతం నష్టాల పేరుతో తన ఉనికిని ప్రశ్నార్థక స్థితిలో నిలుపుకుంది.

ఇదీ చదవండి:TATA STEEL : విశాఖ ఉక్కుపై టాటా స్టీల్‌ ఆసక్తి

Last Updated : Aug 25, 2021, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details