హృదయ విదారకం... తల్లీకొడుకుల బలవన్మరణం - died
ఎంత కష్టమొచ్చిందో... ఆ తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎవరేమన్నారో... కలిసే తనువు చాలించారు. ఈ హృదయ విదారక సంఘటన విశాఖ జిల్లా పెడగంట్యాడ హౌషింగ్ బోర్డ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
విశాఖ జిల్లాలో తల్లీబిడ్డల బలవన్మరణం కలకలం రేపింది. ఓ కుటుంబంలో ఒకేసారి ఇద్దరు విగత జీవులుగా మారటం అందరినీ కలచివేసింది. స్థానికుల కథనం ప్రకారం... అనకాపల్లి ప్రాంతం కొత్తూరుకు చెందిన మల్లికా జయంతికి హౌషింగ్ బోర్డ్ ప్రాంతానికి చెందిన రామ శాస్త్రితో వివాహమైంది. వీరికి కౌశిక్(12), తులసి అనే ఇద్దరు పిల్లలు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేరు. తల్లి మల్లికా జయంతి, కుమారుడు కౌశిక్ ఫ్యాన్ కు ఉరిపోసుకుని ఆత్మహత్య పాల్పడ్డారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ ఇంట పెను విషాదమే చోటు చేసుకుంది. భర్త రామశాస్త్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.