MONKEYPOX RTPCR KIT: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలోని మెడ్‌టెక్ జోన్‌లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్‌ను విడుదల చేశారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా సంస్థ తయారు చేసిన ఈ కిట్‌ను విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ విడుదల చేశారు. మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోందని.. ఇప్పటికే 75 దేశాలను చుట్టేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది. మంకీ పాక్స్‌ను గుర్తించేందుకు ఈ కిట్‌ను తొలిసారి భారత్‌లో తయారు చేసి.. మేకిన్ ఇండియాలో భాగస్వాములమయ్యామని సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సురేష్ వజిరాని వెల్లడించారు. పూర్తిగా దేశీయ సాంకేతికత పరిజ్ఞానంతోనే ఈ కిట్ రూపొందించినట్టు వివరించారు.
వైజాగ్‌లో మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ విడుదల - ap latest news
RTPCR KIT FOR MONKEYPOX మంకీపాక్స్ కేసులను గుర్తించడానికి ఎర్బా-ట్రాన్స్ఆసియా సంస్థ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్‌ను రూపొందించింది. ఈ టెస్ట్ కిట్‌ను విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు అజయ్‌కుమార్ సూద్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు, సీనియర్ వైద్యులు పాల్గొన్నారు.
MONKEYPOX RTPCR KIT
మంకీ పాక్స్‌ను ఈ కిట్ వేగంగా గుర్తించగలుగుతుందని పరిశోధనా విభాగం ఉపాధ్యక్షులు డాక్టర్ మనోజ్ చుగ్ వివరించారు. రెండు మిలియన్ టెస్ట్ కిట్లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం తమకు ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర కార్యదర్శి డాక్టర్ అర్బింద మిత్ర, ఐసీఎంఆర్ విశ్రాంత డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ, బయో టెక్నాలజీ విభాగం సలహాదారు డాక్టర్ అల్క శర్మ, మెడ్ టెక్ జోన్ ఎండీ, సీఈవో డాక్టర జితేంద్రశర్మ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: