ENGLISH TEACHER MOHANRAO: విశాఖ జిల్లా తగరపువలసకు చెందిన గంటాన మోహనరావు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. ప్రస్తుతం జీవీఎంసీ దండుబజార్ పాఠశాలలో అంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆంగ్లం విషయంలో గ్రామీణ, తెలుగు మాధ్యమం విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన రెండు పుస్తకాలను రాశారు. పుస్తకాలతో పిల్లల్లో ఉన్న భాషాపరమైన భయాన్ని దూరం చేస్తున్నారు.
ENGLISH TEACHER MOHANRAO: ఆయన పుస్తకాలు పఠిస్తే.. ఇంగ్లీష్‌ను ఓ పట్టు పట్టొచ్చు! - vishaka news
ENGLISH TEACHER MOHANRAO:ఆంగ్లం...! ప్రస్తుత గ్లోబలైజేషన్ కాలంలో.. విద్యార్థుల భవిష్యత్తుకు అత్యవసరం. గ్రామీణ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ భాషను నేర్చుకునే క్రమంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనవసరమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా విద్యార్ధులు సులభంగా ఆంగ్లంలో పట్టు సాధించేందుకు.. విశాఖ జీవీఎంసీ పాఠశాల ఉపాధ్యాయుడు రెండు పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆంగ్లంలో పట్టుకు రెండు పుస్తకాలు రాసిన మోహనరావు
ఐదేళ్లు శ్రమించి ఈ పుస్తకాన్ని రూపొందించిన మోహనరావు... 12 రోజుల్లోనే విద్యార్థులు ఆంగ్లంలో ప్రాథమిక లోపాల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందంటున్నారు. దాతలు, సహ ఉపాధ్యాయుల ఆర్థిక సహకారంతో వెయ్యి కాపీలు ముద్రించి పాఠశాల విద్యార్థులకు అందజేశారు.గ్రామీణ, తెలుగు మాధ్యమం విద్యార్థుల భాషోన్నతికి కృషి చేస్తున్న మోహనరావు.. ఉత్తమ ఉపాధ్యాయుడిగా మన్ననలందుకుంటున్నారు.
ఇదీ చదవండి: