విశాఖ జిల్లా అనకాపల్లి కార్మిక శాఖ కార్యాలయం వద్ద మెడల్ ల్యాబ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడాల్ ల్యాబ్లను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని రకాల పరీక్షలను ఈ ల్యాబ్ లో ఉచితంగా చేసేవారు.
వేతనాలు చెల్లించాలని మెడల్ ల్యాబ్ సిబ్బంది ఆందోళన - Anakapalli Labor Department Office
వేతనాలు చెల్లించాలని కోరుతూ మెడల్ ల్యాబ్లో పనిచేస్తున్న సిబ్బంది విశాఖ జిల్లా అనకాపల్లి కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
జీతాలు చెల్లించండి మహా ప్రభో
అయితే వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిధులు రావడంలేదని.. అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో మెడాల్ పరీక్షలు నిలిపివేశారని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ల్యాబ్ లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి'విశాఖలో మానవ, సాంకేతిక వనరులపై కమిటీ అధ్యయనం చేస్తుంది'