విశాఖ జిల్లా అరకు డుముకు మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడి.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని భాజపా ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్‌లు పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఈ ప్రమాదానికి గురి కావడం బాధాకరమని.. మృతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్యాటకుల తాకిడి ఉన్న అరకు ఘాట్ రోడ్డులో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయని.. వీటికి రక్షణ గోడలు నిర్మించాలని కోరారు.
అరకు ప్రమాద బాధితులకు మాధవ్, కిడారి పరామర్శ - Araku accident latest news
అరకు ప్రమాద బాధితులను విశాఖ కేజీహెచ్‌లో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్‌లు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.
అరకు ప్రమాద బాధితులకు మాధవ్, కిడారి పరామర్శ
రోడ్డు ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకు చెందిన అధికారులు వైద్య సేవల్ని పర్యవేక్షిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను ఇవాళ సాయంత్రంలోగా వారి స్వస్థలాలకు పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:అరకు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం