విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్ పేట, కొర్లయ్యపేట, ఈదటం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రావలసిన రూ.10వేల పరిహారాన్ని త్వరలో అందజేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మత్స్యకార పేదలకు పక్కా ఇళ్లు, సామాజిక భవనాలు, వ్యాపార రుణాలు వంటివి మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేట సమయంలో సముద్రంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు 10 లక్షల రూపాయల వరకు బీమా ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
'మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తాం' - vishakapatnam district
మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామని శాసనసభ్యుడు గొల్ల బాబురావు తెలిపారు.
mla visited to the payakaravupeta mandal in vishakapatnam district