వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విశాఖ జిల్లా పాయకారావుపేట ఎమ్మెల్యే బాబురావుకు తితిదే పాలకవర్గంలో డైరెక్టర్ పదవి వచ్చింది. ఈ అవకాశం రావడం పట్ల కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ గా పనిచేసిన బాబురావు వైఎస్సార్ పిలుపుతో, ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జగన్ మీద అభిమానంతో వైకాపాలో చేరారు. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైకాపా తరుపున ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవి వస్తుందని ఆశించినా.. రాజకీయ, సామాజిక సమీకరణాలు కారణంగా దక్కలేదు. ఈ తరుణంలో తితిదే బోర్డు డైరెక్టర్ గా అవకాశం రావటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు తితిదే డైరెక్టర్ పదవి - payakaraopeta
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు టీటీడీ పాలకవర్గంలో డైరెక్టర్గా నియమితులయ్యారు.
ఎమ్మెల్యే