విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. అంతర్వేది ఘటన, హిందూ దేవాలయాలపై దాడుల గురించి స్పందించారు.
'రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు' - venugopala krishna visit simhadri appanna
రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. హిందూ దేవాలయాలపై దాడుల గురించి త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు.
మంత్రి వేణుగోపాలకృష్ణ
ప్రభుత్వంపై దుష్టశక్తులు పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. అంతర్వేది ఘటనపై ముఖ్యమంత్రి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేశారని మంత్రి వివరించారు. ప్రభుత్వాన్ని పదేపదే అప్రతిష్టపాలు చేయడానికి పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండీ... ఆ బెంజ్ కారు.. మంత్రి ఇంట్లోనే ఉంది: అయ్యన్నపాత్రుడు