రాష్ట్రంలో రెండు చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని రాష్ట్ర మత్య్స శాఖ మంత్రి మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. పాయకరావుపేటలో మాట్లాడిన ఆయన... నిర్మించబోయే హార్బర్ లు విశాఖ జిల్లా పూడిమడక, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ వద్ద ఉంటాయన్నారు. నక్కపల్లి తీరం వద్ద మినీ జెట్టి నిర్మాణానికి త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తునట్లు మంత్రి వివరించారు. మత్స్య ఉత్పత్తుల అమ్మకాలకు మార్కెటింగ్ సులభతరం, రాయితీపై ఇంజన్ బోట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
రెండు చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి చర్యలు: మంత్రి అప్పలరాజు
రాష్ట్రంలో రెండు చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక ఫథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
minister sidiri appalaraju